శృంగారం అంతిమ లక్ష్యం శారీరక వాంఛలు తీర్చుకోవడం, సంతానం పొందడం మాత్రమే కాదు, శృంగారంతో భాగస్వాములిద్దరి శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి.
By Bolleddu Sarath Chandra Jan 29, 2025
Hindustan Times Telugu
శృంగారం ఇద్దరి మధ్య ఆకర్షణ మాత్రమే కాదు.. దాని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మెదడు నుంచి విడుదలయ్యే రసాయిన చర్యలు అందించే సంకేతాలతోనే శృంగారంపై ఆసక్తి, ఉత్సాహం, స్ఖలనం, భావప్రాప్తి కలుగుతుంది.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక, మానసిక శ్రమ నిరంతరమైన పని, జీవన విధానం శృంగారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మారుతున్న ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్స్, నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం వల్ల శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది.
ఆధునిక సమాజంలో శృంగారంపై విముఖత, అనాసక్తి ఆందోళన కలిగిస్తున్నాయి.
శృంగార జీవితంలో సెక్స్ ఒక భాగమే కానీ అది మాత్రమే శృంగారానికి ముఖ్యమని భావించకూడదు.
భాగస్వాముల మధ్య శృంగార చర్యల వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
నొప్పులను తగ్గించే ఎండార్ఫిన్ల ఉత్పత్తికి ఆక్సిటోసిన్ దోహదపడుతుంది.
కీళ్లు, కండరాల నొప్పులు, తలనొప్పులు, నడుం నొప్పి, బహిష్టు ముందు స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
సాధారణ సమయంలో కంటే భావప్రాప్తి సమయంలో ఆక్సిటోసిన్ ఐదు రెట్లు అధికంగా విడుదల అవుతుంది.
స్ఖలన సమయంలో పురుషుల్లో వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి హార్మోనులు విడుదల అవుతాయి.
హస్త ప్రయోగం సమయంలో విడుదలయ్యే ప్రొలాక్టిన్ కంటే సెక్స్‌లో పాల్గొన్నపుడు విడుదలయ్యే ప్రొలాక్టిన్ మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది.
తరచుగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల దేహంలో ఇమ్యూనోగ్లోబ్యులిన్ ప్రతిరక్షాలు ఉత్పత్తి అవుతాయి. ఇది చిన్న చిన్న వ్యాధుల్ని ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సాయపడుతుంది.
తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల స్ఖలన సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ లోపాల వల్ల వచ్చే స్ట్రోక్స్ రావు. బీపీ నియంత్రణలో ఉంటుంది. మూత్ర వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తవు. పురుషుల్లో క్యాన్సర్ ముప్పు తప్పించుకోవచ్చు.