కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేం. జీర్ణక్రియ సాఫీగా జరిగినప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడగలం.

pexel

By Ramya Sri Marka
Jan 26, 2025

Hindustan Times
Telugu

అల్లం: ఈ పదార్థం తినడం వల్ల క్రాంపింగ్ తగ్గి, ఉబ్బరం లేకుండా చేస్తుంది. వాంతులు, వికారం ఉన్నప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు.

pexel

సోంపు గింజలు: యాంటీపస్మోడిక్ గుణాలున్న సోంపు గింజలు జీర్ణక్రియకు, కండరాలు బిగుసుకుపోకుండా ఉండేందుకు సాయపడుతుంది.

pexel

కొత్తిమీర: జీర్ణక్రియను వేగవంతం చేసి, మైక్రోబయోమ్‌కు మద్దతు ఇస్తుంది.

pexel

మిరియాలు: మెరుగైన ప్రేగు ఆరోగ్యానికి సహకరించే నల్ల మిరియాలు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. 

pexel

దాల్చిన చెక్క: రక్తప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం నుంచి ఉపశమనానికి కీలకంగా ఉపయోగపడుతుంది.

pexel

యాలకులు: మూత్ర విసర్జన ప్రక్రియ సాఫీగా సాగేందుకు జీర్ణక్రియలో అదనపు ద్రవాలకు, గ్యాస్‌ను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.

pexel

జీలకర్ర: జీర్ణక్రియను మెరుగుపరిచి ఆహారంలో పోషకాల శోషణకు సహకరిస్తుంది. 

pexel

పిల్లలు ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash