వేసవిలో కంటి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా....? ఈ 7 విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 23, 2025
Hindustan Times Telugu
వేసవి వేళ కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎండల తీవ్రతకు కళ్లు చాలా ఒత్తిడికి గురవుతాయి. కొన్ని జాగ్రత్తలతో కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
image credit to unsplash
సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు శుక్లాలు, రెటీనాపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎండ కాస్తున్నప్పుడు అద్దాలు ధరించటం చాలా మంచిది.
image credit to unsplash
వేసవి సీజన్ లో ఎక్కువగా నీరు తీసుకోవాలి. శరీరంలో నీటి కంటెంట్ తగ్గితే కళ్లు పొడిబారుతాయి. దీంతో మంట మొదలవుతుంది
image credit to unsplash
కొంతమందికి ఈ సీజన్‌లో నిరంతరం కంటిలో చికాకు ఉంటుంది. ప్రధానంగా గాలిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల అలర్జీకి గురవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
image credit to unsplash
వేసవిలో విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నిమ్మకాయ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రాడికల్ నష్టం మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లను రక్షించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
నారింజ, మామిడి,బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి పండ్లలోని విటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి. కంటి ఆరోగ్యానికి దోహదపడుతాయి.
image credit to unsplash
కళ్లు అలిసిపోయినట్లు అనిపించినప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కంటి చుట్టూ దుమ్ము, ధూళి, మసక లేకుండా చూసుకోవాలి.
image credit to unsplash
సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త