ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి విషయాలు ఒత్తిళ్లకు కారణం అవుతాయి. అయితే ఒత్తిడి తగ్గించుకునేందుకు 7 సూపర్ ఫుడ్స్ ను ప్రయత్నించండి. ఈ ఆహారాలు కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
pexels
By Bandaru Satyaprasad Jul 20, 2024
Hindustan Times Telugu
బ్లూబెర్రీస్ - బ్లూబెర్రీస్ ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ లు. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడతాయి.
pexels
సిట్రస్ ఫ్రూట్స్ - సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ, ద్రాక్ష పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
pexels
డార్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతుంది. ఫీల్ గుడ్ హార్మోన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
pexels
సాల్మన్ చేప -సాల్మన్ చేపలో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుంది.
pexels
అరటి పండు - అరటి పండులోని అధిక పొటాషియం, మెగ్నీషియం కండరాలను సడలించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కండరాల బలహీనత, నొప్పి వంటి ఒత్తిడి లక్షణాలు తగ్గిస్తుంది.
pexels
గుడ్లు - గుడ్లు ట్రిప్టోఫాన్ తో నిండి ఉంటాయి. ఇది సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడిని తగ్గించి మానస్థితిని మెరుగుపరుస్తుంది. గుడ్లు నిద్ర, జ్ఞాపకశక్తిని నియంత్రించడంలో సహాయపడతాయి.
pexels
స్వీట్ పొటాటోస్ - స్వీట్ పొటాటోస్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడాతియ ఒత్తిడిని స్థాయిలను నియంత్రిస్తాయి.
pexels
బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..