ఈ వేసవిలో పుదీనా వాటర్ ఎందుకు తీసుకోవాలి..? 7 కారణాలు
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Mar 06, 2025
Hindustan Times Telugu
పుదీనా వాటర్... ఐరన్ పుష్కలంగా ఉండే అద్భుతమైన డిటాక్స్ వాటర్. ఈ వేసవికి చాలా మంచిది. అలసిపోకుండా శక్తినిస్తుంది.
image credit to unsplash
పుదీనా నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. గ్యాస్ మరియు ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గిస్తాయి.
image credit to unsplash
ఈ వేసవిలో మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు పుదీనా నీరు బాగా పని చేస్తుంది. తొందరగా నీరసపడకుండా ఉంటారు.
image credit to unsplash
పుదీనా నీరు తాగడం వల్ల శరీరంలో హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయటంలో తోడ్పడుతుంది. ఈ నీటిని త్రాగడం PCOS, మెనోపాజ్, థైరాయిడ్ సమస్యలను నివారించడానికి కూడా ప్రభావం చూపుతుంది.
image credit to unsplash
పుదీనా నీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఒక ఆయుర్వేద నివారణిగా సహాయపడుతుంది.
image credit to unsplash
బరువు తగ్గాలనుకునేవారు పుదీనా వాటర్ ను డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. రసాయనాలతో ఉండే చక్కెర పానీయాల మాదిరిగా కాకుండా ఈ వాటర్ ఎంతో సహజంగా ఉంటుంది.
image credit to unsplash
పుదీనా ఆకులలో సాలిసిలిక్ ఆమ్లం, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మీ చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.
image credit to unsplash
పెరుగుతో చియా విత్తనాలను కలిపి చేసే ఈ రుచికరమైన రెసిపీలను చూడండి..