సీజనల్‌గా దొరికే గ్రీన్ పీస్ కచ్చితంగా తినాల్సిందే

pixabay

By Haritha Chappa
Jan 23, 2024

Hindustan Times
Telugu

చలికాలంలోనే గ్రీన్ పీస్ అధికంగా లభిస్తాయి. మిగతా సీజన్లో ఇవి తాజావి దొరకవు. స్టోర్ చేసినవి మాత్రమే లభిస్తాయి. 

pixabay

పచ్చిబఠానీలను కచ్చితంగా ప్రతి ఒక్కరూ తినాలి. దీనిలో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటుంది. 

pixabay

డయాబెటిస్ ఉన్న వారు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి  ఎన్ని తిన్నా సమస్య ఉండదు. 

pixabay

జీర్ణక్రియ సవ్యంగా ఉండేందుకు గ్రీన్ పీస్ ను తినాలి. ఇవి శరీరంలో చెడు బ్యాక్టిరియాను దూరంగా ఉంచుతుంది.

pixabay

కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి పచ్చి బఠానీలు మనల్ని కాపాడతాయి. 

pixabay

గర్భిణులు వీటిని తినడం వల్ల కావాల్సినంత ఫోలేట్ పొందవచ్చు. గర్భస్థ శిశువుకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. 

pixabay

 రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. 

pixabay

వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా బయటపడవచ్చు. 

pixabay

పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash