తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో పిండి వంటలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి తెలుగు ఇంటిలో సంక్రాంతికి రుచికరమైన వంటకాలు చేస్తుంటారు. రుచితో పాటు ఆరోగ్యానికి మంచివి.  

pexels

By Bandaru Satyaprasad
Jan 08, 2025

Hindustan Times
Telugu

సకినాలు, బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు...ఇలా వివిధ రకాల నోరూరించే వంటకాలకు సంక్రాంతికి చేస్తుంటారు.  తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వండే కొన్ని ప్రత్యేక వంటకాలు, వాటి తయారీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.  

pexels

కజ్జికాయలు- తెలుగు వారి ఇళ్లలో ఒక సాంప్రదాయక వంటకం కజ్జికాయలు. బయట నుంచి క్రంచీగా, లోపల మృదువుగా కొబ్బరి నూజు లేదా తీపి పొడిని కలిగి ఉంటుంది. లోపలి వాడే పదార్థం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. తెలంగాణలో నువ్వుల పూరకం, రాయలసీమలో వేరుశెనగ పొడి, ఆంధ్రాలో కొబ్బరి నూజు వాడతారు. 

pexels

సున్నుండలు- మినుములతో చేసే ప్రత్యేక వంటకం సున్నుండలు. మినుములు వేయించి ఆ తర్వాత మెత్తటి పొడిగా చేసి బెల్లం కలుపుతారు. ఆ మిశ్రమానికి నెయ్యి కలిపి లడ్డూలుగా తయారు చేస్తారు. కొత్త అల్లుడు సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ వంటకం ప్రత్యేకంగా వడ్డిస్తారు. మినుములు శక్తిని ఇస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, నెయ్యి  ప్రోటీన్లు, పోషకాలను అందిస్తుంది.  

pexels

సకినాలు, బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు...ఇలా వివిధ రకాల నోరూరించే వంటకాలకు సంక్రాంతికి చేస్తుంటారు.  తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వండే కొన్ని ప్రత్యేక వంటకాలు, వాటి తయారీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.  

pexels

బెల్లం గవ్వలు- ఈ పిండి వంటను గోధుమ పిండి, బెల్లం లేదా పంచదార పాకంతో తయారుచేస్తారు. ఈ తీపి వంటకం క్రంచీగా ఉంటుంది. కొన్ని నెలల పాటు నిల్వ ఉండే వంటకం. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు.   

pexels

అరిసెలు-తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ప్రసిద్ధిమైన వంటకం. బియ్యపు పిండి, బెల్లంతో వీటిని తయారు చేస్తారు. ఏపీలో సంక్రాంతికి ఇది ప్రధానమైన పిండి వంట. బెల్లం రక్తా్న్ని శుభ్రం చేస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ఐరన్‌ వంటి అనేక పోషకాలు శరీరానికి లభిస్తాయి. 

pexels

బొబ్బట్లు- పండుగ వచ్చిందంటే బొబ్బట్లు ఉండాల్సిందే. బెల్లం, గోధుమలు, మైదా పిండితో తయారు చేస్తారు. బొబ్బట్లు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్రా ప్రాంతంలో బొబ్బట్లు, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బక్షాలు అంటారు. 

pexels

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash