శరీరంలో ఉప్పు మీద ఆధారపడని అవయవం అంటూ ఏమీ లేదు.

By Bolleddu Sarath Chandra
Jan 07, 2025

Hindustan Times
Telugu

మానవ శరీరంలో జరిగే రసాయినిక చర్యలన్నీ ఉప్పు మీదే ఆధారపడి జరుగుతాయి. 

ఉప్పు శరీరంలో నీటి సమతుల్యత కాపాడుతుంది.

ఆహారంలో ఉప్పును తీసుకోకపోతే శరీరంలో ఉన్న నీటిని మొత్తాన్ని కిడ్నీలు బయటకు పంపేస్తాయి. 

గుండె కండరాలు, శరీరంలోని ఇతర కండరాలు సాఫీగా పనిచేయడానికి సోడియం సహకరిస్తుంది. 

శరీరంలో సరిపడా సోడియం ఉంటే ఎలాంటి ప్రేరణకైనా కండరాలు సంకోచ, వ్యాకోచాలతో సజావుగా స్పందిస్తాయి.

శరీరంలో ఆమ్లం, క్షారాల  నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యల్లో సోడియం ముఖ్య పాత్ర పోసిస్తుంది. 

సోడియం స్థాయి పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సక్రమంగా వ్యాపించవు. కండరాలు నీరసించి మనిషి అలసటకు గురవుతాడు. 

రోజుకు కనీస వ్యాయామం చేసే మనిషికి కనీసం నాలుగు గ్రాముల సోడియం అవసరం ఉంటుంది. ప్రతి గ్రాము ఉప్పులో 40శాతం సోడియం, 60శాతం క్లోరైడ్ ఉంటాయి.  నాలుగు గ్రాముల సోడియం లభించాలంటే కనీసం పది గ్రాముల ఉప్పు తీసుకోవాలి.

శారీరక శ్రమ ఎక్కువ చేసేవారికి, క్రీడాకారులకు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసే వారికి సోడియం అవసరం ఎక్కువ ఉంటుంది. 

శరీరంలో వచ్చే చెమటలో 0.1శాతం నుంచి 0.3శాతం వరకు సోడియం క్లోరైడ్ ఉంటుంది.  చలికాలంలో చెమట ద్వారా బయటకు  పోయే ఉప్పు ఏమి ఉండదు. మండు వేసవిలో బయట తిరిగితే రోజుకు 12.5 గ్రాముల ఉప్పు శరీరం నుంచి బయటకు పోతుంది. 

శరీరంలో చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటి కంటే ఉప్పు ఎక్కువైతే దప్పిక పెరుగుతుంది.  శరీరం నీటిని అదనంగా తాగాలనిపిస్తుంది. 

ఆహారంలో ఉప్పును అధికంగా వినియోగించడం వల్ల మూత్ర పిండాలు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపలేవు.

శరీరంలో నీరు బయటకు వెళ్లకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. 

శరీరంలో ద్రవ పరిమాణం పెరిగితే  శరీరంలో ఇముడ్చుకునే లేక శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ ఒత్తిడినే బీపీ అంటారు. 

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరగడానికి కారణం అవుతుంది. 

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే చాలా సందర్భాల్లో అది మూత్ర విసర్జన ద్వారా బయటకు పోతుంది. బీపీ ఉన్న వారు పరిమితంగా ఉప్పును ఆహారంలో తీసుకోవాలి.  హార్ట్‌ పేషెంట్లు, కిడ్నీలు పాడై డయాలిసిస్‌పై ఉన్న వారు, సిర్రోసిస్‌ సమస్యతో ఉన్న వారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. 

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels