రింకూ సింగ్‌కు కాబోయే భార్య ప్రియా సరోజ్ ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?

By Sanjiv Kumar
Jan 17, 2025

Hindustan Times
Telugu

ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

అయితే, ప్రియా సరోజ్ తండ్రి, మాజీ ఎంపీ తుఫానీ సరోజ్ ఈ వార్తలను ఖండించారు.

ఈ సంబంధం గురించి రెండు కుటుంబాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయని, కానీ ప్రస్తుతానికి నిశ్చితార్థం జరగలేదని తుఫానీ సరోజ్ చెప్పారు. 

25 ఏళ్ల ప్రియా సరోజ్ సుప్రీంకోర్టులో న్యాయవాది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.

ప్రియా సరోజ్ నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

ప్రియా సరోజ్ మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి బిజెపి సీనియర్ నేత బి.పి. సరోజ్‌ను 35,000 ఓట్ల తేడాతో ఓడించారు.

ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

తుఫానీ సరోజ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరపున కేర్‌కట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇదిలా ఉంటే, 27 ఏళ్ల రింకూ సింగ్ భారత్ తరపున 2 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels