పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడు కదలికలను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది కాలక్రమేణా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. శారీరక, మానసిక మార్పులకు కారణవుతుంది. పార్కిన్సన్స్ లో 10 సాధారణ లక్షణాలు గురించి తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Apr 13, 2025
Hindustan Times Telugu
అసంకల్పిత కదలిక - పార్కిన్సన్స్ ఉన్న వారు శరీర కదలికలను నియంత్రించలేరు. ట్విస్టింగ్ లేదా జర్కింగ్ వంటి అనియంత్రిక కదలికలు ఉండవచ్చు. వీటిని ఆపడం కష్టం.
pexels
వణుకు - పార్కిన్సన్స్ లో ... చేతులు లేదా కాళ్లలో వణుకు అత్యంత గుర్తించదగిన సంకేతాలలో ఒకటి. ఇది శరీరంలోని ఒక వైపున ప్రారంభవుతుంది. విశ్రాంతి సమయంలో ఈ కదలికలను చూడవచ్చు.
pexels
బ్రాడికినేసియా(నెమ్మదిగా కదలిక) - రోజు వారీ పనులు చేయడం నెమ్మదిస్తుంది. షర్ట్ బటన్స్ తీసుకోవడం, వాకింగ్ చేయడం నెమ్మదిగా లేదా కష్టంగా మారుతుంది.
pexels
ఇంద్రియ ఆటంకాలు -వాసన చూసే శక్తిని కోల్పోవడం, ఒళ్లు జలదరింపు లేదా ఇతర వింత అనుభూతి ఉంచవచ్చు.
pexels
కండరాల బలహీనత - కండరాలు గట్టిగా లేదా బిగుతూ అనిపించవచ్చు. దీని వలన కదలడం కష్టం అవుతుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది. చేతులు, కాళ్లు, మెడ భాగంగా కదలికలను పరిమితం చేస్తుంది.
pexels
నిద్ర సమస్యలు - పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాల్లో నిద్ర సమస్య ఒకటి. చాలా మందికి నిద్రపట్టడంలో సమస్యలు తలెత్తుతాయి.
pexels
స్వరంలో మార్పు- మాటల మృదువుగా, అస్పష్టంగా లేదా ఏకరీతిగా మారవచ్చు. పార్కిన్సన్స్ ఉన్న వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయడంలో ఇబ్బంది పడతారు. వారి స్వరంలో మార్పులు వస్తాయి.
pexels
జ్ఞాపకశక్తి సమస్యలు - పార్కిన్సన్స్ తరువాతి దశల్లో ఆలోచించడం, జ్ఞాపకశక్తి సమస్యలు సంభవించవచ్చు. కొంతమందికి మతిమరుపు తలెత్తి రోజు వారీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
pexels
మానసిక ఆరోగ్య సమస్యలు - పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వారిలో నిరాశ, ఆందోళన, మానసిక స్థితిలో మార్పులు సాధారణం. భావోద్వేగ మార్పులు చోటుచేసుకుంటాయి.
pexels
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు