రియల్‍మీ నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది.
Photo: Realme
ఈ ఫోన్ కేవలం 7.49 మిల్లీమీటర్ల మందం ఉంది. బడ్జెట్ రేంజ్‍లో ఇదే స్లిమ్మెస్ట్ మొబైల్ అని రియల్‍మీ పేర్కొంది.
Photo: Realme
6.74 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేను రియల్‍మీ నార్జో ఎన్53 కలిగి ఉంది.
Photo: Realme
యునిఎస్‍ఓసీ (Unisoc) టీ612 ప్రాసెసర్‌పై ఈ 4జీ ఫోన్ వన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‍మీ యూఐ టీ ఎడిషన్ ఓఎస్ ఉంటుంది.
Photo: Realme
రియల్‍మీ నార్జో ఎన్53 వెనుక 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Photo: Realme
ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్‍ను పోలిన మినీ క్యాప్సుల్ ఫీచర్‌ను రియల్‍మీ నార్జో ఎన్53 కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ డిజైన్ కూడా ఐఫోన్‍ను పోలినట్టుగా ఉంది.
Photo: Realme
ఈ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.
రియల్‍మీ నార్జో ఎన్53 4జీబీ ర్యామ్ +64జీబీ స్టోరేజ్ ధర రూ.8,999, 6జీబీ+128జీబీ ధర రూ.10,999గా ఉంది.
Photo: Realme
మే 24న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్, రియల్‍మీ వెబ్‍సైట్‍లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. 22వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఫోన్ స్పెషల్ సేల్ ఉంటుంది.
Photo: Realme
మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.