పచ్చిగుడ్లను తినడం
శ్రేయస్కరం కాదు, హాఫ్ బాయిల్డ్ కూడా ఒక్కోసారి ప్రమాదకరం అవుతుంది.
ఎక్కువ కాలం పాటు పచ్చిగుడ్లను ఆహారంలో తీసుకుంటే ప్రేగుల్లో బయోటిన్ అనే విటమిన్ శొషణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
పచ్చి గుడ్లను తినేవారిలో బయోటిన్ కొరత ఏర్పడుతుంది.
శరీరంలో బయోటిన్ కొరత ఏర్పడితే ఆ వ్యక్తిలో నీరసం, ఆకలి, జుట్టు రాలిపోవడం, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సగం వేయించిన, ఉడికించిన గుడ్లు అయినా వాటిలో పచ్చిదనం అలాగే ఉంటుంది. అవి ఆహారానికి సురక్షితం కాదు.
హాఫ్ బాయిల్డ్ గుడ్లలో కూడా బయోటిన్ సమస్య ఏర్పడుతుంది.
గుడ్లు నిల్వ ఉండే కొద్దీ వాటిలో రసాయినిక మార్పులు జరుగుతుంటాయి.
కాయగూరల్ని వండినపుడు వాటిలో పోషక విలువలు, విటమిన్‌లు నశిస్తాయి, గుడ్లకు కూడా ఇదే సూత్రాన్ని అన్వయించుకుంటారు.
గుడ్లను ఉడికించకుండా తీసుకోకూడదు. అవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాటిలో అండం పొదగడం మొదలవుతుంది.
హాఫ్ బాయిల్డ్ కూడా అదే పనిగా ఆహారంలో తీసుకోవడం ప్రమాదమే అవుతుంది.
పచ్చి గుడ్లలో సల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఆహార విషం, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వండితే పోషక విలువలు నశిస్తాయనే ఉద్దేశంతో ఉడకబెట్టడం కంటే పచ్చిగుడ్లను ఆహారంగా తినడం వల్ల ఎక్కువ పోషక విలువలు లభిస్తాయనేది అపోహ మాత్రమే..
గుడ్డు అందరికీ మంచిదే కానీ గుండె జబ్బులు, హై బీపీ ఉన్నవారు 35-40 ఏళ్లు దాటిన వారు గుడ్లను తినడం తగ్గించాలి. గుడ్డులో అధిక కొలెస్ట్రారల్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మధుమేహ రోగులు కూడా వారానికి రెండు గుడ్లను మించి తినకూడదు.
గుండె జబ్బులకు కొవ్వులు ఎంత వరకు కారణం....ఆ ప్రచారంలో నిజం ఎంత?