కొబ్బరి, కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.
Unsplash
By Anand Sai Sep 03, 2023
Hindustan Times Telugu
పచ్చి కొబ్బరిని తింటే చాలా మంచిది. కొబ్బరిలో ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్లు సి, ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి.
Unsplash
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అనేక ఔషధ గుణాలు కొబ్బరిలో ఉన్నాయి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.
Unsplash
పచ్చి కొబ్బరి మలబద్ధకం సమస్య నుంచి బయటపడేస్తుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.
Unsplash
పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Unsplash
కొబ్బరిలో ఉండే ఫ్యాటీ కంటెంట్ చర్మానికి పోషణనిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
Unsplash
పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో చాలా సహాయపడుతుంది. పడుకునే కొద్దిసేపటి ముందు పచ్చి కొబ్బరిని తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది.
Unsplash
పచ్చి కొబ్బరి కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహకరిస్తాయి.
Unsplash
విటమిన్ డీ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు- అందుకే ఈ ఫుడ్స్ తినండి!