సాయి పల్లవి, రకుల్ రెజెక్ట్ చేసిన సినిమాలతో హిట్ కొట్టిన రష్మిక మందన్నా!

By Sanjiv Kumar
Feb 28, 2025

Hindustan Times
Telugu

కొన్నిసార్లు అదృష్టం ఎలా మారుతుందో చెప్పలేం. అందుకు రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాలే నిదర్శనం!

ఇతర స్టార్  హీరోయిన్స్ తిరస్కరించిన సినిమాలలో రష్మిక మందన్నా నటించి సూపర్ డూపర్ హిట్లు అందుకుంది.

రష్మిక మందన్నా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది. కానీ, ఆ సినిమాలలో నేషనల్ క్రష్ మొదటి ఎంపిక కాదు.

పుష్ప ది రైజ్ సినిమాలో శ్రీవల్లి పాత్రకు మొదట సమంతను సంప్రదించారు. కానీ, ఆమెకు ఇతర ఒప్పందాల కారణంగా తిరస్కరించింది. దాంతో ఈ అవకాశం రష్మికకు దక్కింది.

పుష్ప ది రైజ్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాకు మొదట బాలీవుడ్ బ్యూటి పరిణితి చోప్రాను అనుకున్నారట. కానీ, ఆమెతో కుదరకపోయేసరికి ఈ పాత్ర కూడా రష్మికను వరించింది. 

యానిమల్

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా నటించిన గీతా గోవిందం సినిమాలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ నటించాల్సింది. కానీ, చివరికి రష్మిక ఎంపికైంది.

గీతా గోవిందం

దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాకు మొదట సాయి పల్లవిని సంప్రదించారు. కానీ, పలు కారణాల వల్ల ఆ సినిమాలో కూడా రష్మికనే నటించాల్సి వచ్చింది. వారసుడు మూవీ తమిళంలో మంచి హిట్ అందుకుంది.

వారసుడు

ఈ నెలలో వివాహిత స్త్రీలు ఈ విధంగా శివారాధన చేస్తే వైవాహిక జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది