రంజీ చరిత్రలో తిరుగులేని రికార్డులు

By Sanjiv Kumar
Jan 23, 2025

Hindustan Times
Telugu

42 ట్రోఫీలతో ముంబై రంజీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఎనిమిది టైటిళ్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది.

రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. 1993/94 ఎడిషన్‌లో 944/6 వద్ద డిక్లేర్ చేసింది.

రంజీ ట్రోఫీలో అత్యల్ప స్కోరు చేసిన జట్టు కూడా హైదరాబాద్. 2010లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులకే ఆలౌటైంది.

రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విదర్భ మాజీ ఆటగాడు, ముంబై బ్యాట్స్ మన్ వసీం జాఫర్ రికార్డు సృష్టించాడు. 238 ఇన్నింగ్స్‌లో 12,038 పరుగులు చేశాడు.

సౌరాష్ట్రపై మహారాష్ట్రకు చెందిన భౌసాహెబ్ బాబాసాహెబ్ నింబాల్కర్ చేసిన 443 పరుగులు రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు.

ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది