చలికాలంలో ముల్లంగి తినడం వల్ల ఏడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. అవేంటో చూడండి

Pixabay

By Hari Prasad S
Jan 09, 2025

Hindustan Times
Telugu

ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎంతో అవసరం

Pixabay

ముల్లంగిలో 95 శాతం నీళ్లే ఉంటాయి. దీనివల్ల మీ శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది

Pixabay

ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రోజూ తీసుకుంటే అజీర్తి, మలబద్ధకం సమస్యలు ఉండవు

Pixabay

ముల్లంగిలో కేలరీలు తక్కువగా, ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలని చూసేవారికి ఇది మంచి స్నాక్

Pixabay

ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల అది బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది

Pixabay

ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది

Pixabay

ముల్లంగిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది

Pixabay

సాయంత్రం తర్వాత పూలు, ఆకులను ఎందుకు కోయకూడదు?