గుమ్మడికాయ గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మీకు తెలిస్తే మీరు కచ్చితంగా విత్తనాలను పడేయరు.
Unsplash
By Anand Sai Jun 24, 2025
Hindustan Times Telugu
గుమ్మడికాయ గింజలను పచ్చిగా కూడా తినవచ్చు. కానీ గుర్తుంచుకోండి.. వేడి ఎక్కువ. గర్భిణీ స్త్రీలు దీనిని తినే ముందు జాగ్రత్తగా ఉండాలి.
Unsplash
గుమ్మడికాయ గింజలు మాంగనీస్, విటమిన్ కె వంటి విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండూ గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి.
Unsplash
వాటిలో జింక్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Unsplash
గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
గుమ్మడికాయ గింజల రసం, పచ్చి విత్తనాల పేస్ట్ తయారు చేసి తీసుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు అనేక యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.
Unsplash
గుమ్మడికాయ గింజలు ఫైబర్ మంచి మూలం. పడుకునే ముందు తినడం వల్ల మీకు మంచి రాత్రి విశ్రాంతి లభిస్తుంది.
Unsplash
గుమ్మడికాయ గింజలు నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం అయిన ట్రిప్టోఫాన్ సహజ మూలం. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Unsplash
అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..