ఎముకల బలానికి ప్రొటీన్ కావాల్సిందే..! ఈ విషయాలు తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 09, 2025
Hindustan Times Telugu
శరీరంలో ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. అవి బలహీన పడితే జీవితం నరకప్రాయమవుతుంది. అనేక సమస్యలు వస్తాయి.
image credit to unsplash
యుక్త వయసు వరకు ఎముకలు బలంగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా బలహీనమవుతుంటాయి. అయితే కొన్ని జాగ్రతలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
image credit to unsplash
నిజానికి ఎముకల ఆరోగ్యానికి, ధృడత్వానికి క్యాల్షియం తీసుకుంటే సరిపోతుందని చాలా వరకు భావిస్తుంటారు. కానీ కేవలం క్యాల్షియం మాత్రమే కాదు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
image credit to unsplash
ఎముక క్షీణించే క్రమంలో దాన్ని తిరిగి భర్తీ చేయటంలో ప్రోటీన్ పుడ్ చాలా సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
image credit to unsplash
శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే ప్రొటీన్, క్యాల్షియం రెండూ తగినంత మోతాదుల్లో ఉండాలి. అలాగైతే ఎముక ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రావు.
image credit to unsplash
పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిల్లో క్యాల్షియంతో పాటు ప్రొటీన్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమంగా తీసుకుంటే ఎముకలకు మంచి పోషకాలు అందుతాయి.
image credit to unsplash
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ ఉండే ఆహారాలు మాత్రమే కాకుండా ప్రోటీన్ పుడ్ కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.