దీర్ఘాయుష్షు కావాలంటే కాలేయాన్ని కాపాడుకోవాల్సిందే...

By Bolleddu Sarath Chandra
Jan 28, 2025

Hindustan Times
Telugu

మానవ మనుగడ మొత్తం లివర్‌ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.  శరీరంలో 1500 గ్రాముల బరువు ఉండే లివర్‌ దేహంలో అతి పెద్ద గ్రంథి, చర్మం తర్వాత అతిపెద్ద అవయవంగా వ్యవహరిస్తుంది. 

కాలేయం శరీరంలో కనీసం 500కు పైగా విధులు నిర్వర్తిస్తుంది. 

మనం తినే ఆహారం జీర్ణం కావడం, ఆహారం నుంచి శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించడం, జీర్ణకోశంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడం లివర్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

లివర్‌ కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఇతర ఆహార పదార్ధాల నుంచి శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను తయారు చేస్తుంది.

శరీరంలో ప్రొటీన్స్‌ను తగిన స్థాయిలో స్థిరీకరించి శరీర అవయవాలకు అనుగుణంగా దానిని గ్లూకోజ్‌గా, యామినో యాసిడ్స్‌గా మార్చి నిల్వ చేస్తుంది.

లివర్‌ గ్లూకోజ్‌ను గ్లైకోజిన్‌గా మార్చి దానిని శరీరంలో నిల్వ చేసి అలసటకు గురైనపుడు దానిని తిరిగి గ్లూకోజ్‌గా మార్చి తగిన శక్తిని అందిస్తుంది

శరీరంలో ప్రొటీన్స్‌ స్థిరీకరించి శరీర అవయవాలకు అనుగుణంగా గ్లూకోజ్‌ రూపంలోకి, ఇతర యమినో యాసిడ్స్‌గా మారుస్తుంది. 

శరీరంలో మలినాలను తొలగించడంలో లివర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  ప్రస్తుత కలుషిత వాతావరణం, తినే కలుషిత ఆహారం, లివర్‌ పనితీరుకు మించిన భారం అలసటకు గురి చేస్తుంది. 

లివర్ వ్యాధుల బారిన పడితే శరీరం మొత్తం విషపూరితం అవుతుంది. 

ఫాస్ట్‌ఫుడ్స్‌ అధికంగా తీసుకుంటే కాలేయ వాపుకు కారణం అవుతుంది. ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినేవారిలో 75శాతం మంది లివర్‌ వ్యాధులుకు గురవుతారు. 

అధిక క్యాలరీల ఆహారం, శాట్యూరేటెడ్ కొవ్వు, తీపి వస్తువులు, మద్యం మానేయడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. 

అధిక మద్యపానం కాలేయాన్ని గాయపరుస్తుంది.  మద్యాపానం కాలేయంలో కొోవ్వును చేర్చి దానిని వాపుకు గురి చేస్తుంది. మూడు వారాల పాటు మద్యం సేవిస్తే కాలేయం వాపుకు గురవుతుంది. మద్యపానం నిలిపివేస్తే నాలుగైదు వారాల్లో తిరిగి కోలుకుంటుంది. 

కాలేయంలో వాపును అలాగే కొనసాగిస్తే కాలేయంలో పుళ్లుగా మారుతాయి.  కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం.  ముడి ధాన్యం, పప్పులు తినే వారిలో కాలేయ ఆరోగ్యం మెరుగు పడుతుంది. 

సహజంగా హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు ఇవిగో

pixabay