మగవారికే వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్, దీని లక్షణాలు తెలుసుకోండి

By Haritha Chappa
May 19, 2025

Hindustan Times
Telugu

ప్రోస్టేట్ అనేది పురుషుల మూత్రాశయం క్రింద వాల్నట్ లాంటి గ్రంథి. ఇది వీర్యద్రవాన్ని తయారు చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇది క్రమంగా పెద్దదిగా మారుతుంది. ఇక్కడ అసాధారణంగా కణాలు పెరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది.

డిఎన్ఎలో అవాంతరాల కారణంగా ప్రోస్టేట్ కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభించి కణితులు ఏర్పడతాయి. క్రమంగా, ఈ కణాలు సమీప కణజాలాలకు లేదా ఎముకలకు కూడా వ్యాపిస్తాయి. దీనిని మెటాస్టాసిస్ అంటారు, ఇది చికిత్సను మరింత కష్టంగా మారుస్తుంది.

ఇది 50-60 ఏళ్లు పైబడిన పురుషులలో అధికంగా వచ్చే క్యాన్సర్. వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర ,మరియు ఆఫ్రికన్ సంతతి జనాభాలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

50 ఏళ్లు పైబడిన పురుషుల్లో, గతంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్న కుటుంబంలో ఎవరైనా, ఆఫ్రికా సంతతికి చెందిన వారు, ఊబకాయం లేదా అధిక కొవ్వు ఆహారం తినేవారు, ధూమపానం చేసే పురుషులు కూడా  ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా నెమ్మదిగా ప్రవహించడం, రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం,  వెన్ను, తుంటిలో నిరంతర నొప్పి వంటివి ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.  కాబట్టి రెగ్యులర్ స్క్రీనింగ్ చాలా ముఖ్యం.

ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చిన విషయాన్ని వైద్యులు తరచుగా ఎంఆర్ఐ లేదా బయాప్సీతో నిర్ధారిస్తారు.

డిజిటల్ మల పరీక్ష (డిఆర్ఇ) లో డాక్టర్ గ్లౌజులు ధరించి ప్రోస్టేట్ పరిమాణాన్ని చూస్తారు. మల్టీ-పారామెట్రిక్ ఎంఆర్ఐ గ్రంధిలో కణితి  పరిమాణం,  వ్యాప్తిని చూపుతుంది. అవసరమైతే, ట్రూస్-గైడెడ్ బయాప్సీ నుండి కణజాలాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు.

స్టేజ్ 1 లేదా 2 లో శస్త్రచికిత్స (రాడికల్ ప్రోస్టేక్టమీ) లేదా రేడియోథెరపీ,  హార్మోన్-థెరపీల ద్వారా చికిత్సను అందిస్తారు.  కొత్త మందులు (ఎంజైమ్ ఇన్హిబిటర్స్), కీమో మరియు రోగనిరోధక చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. వయస్సు, దశ,  ఆరోగ్యాన్ని బట్టి ఏ చికిత్సను అందించాలో నిర్ణయం తీసుకుంటారు.

 కటి-ఫ్లోర్ వ్యాయామాలు, మందులు,  కౌన్సెలింగ్ వంటివి రోగికి ఎంతో సహాయపడతాయి. హార్మోన్ల చికిత్స  వల్ల బరువు పెరగడం, ఎముక బలహీనతకు దారితీస్తుంది.  క్యాల్షియం, విటమిన్-డి నిండుగా ఉన్న ఆహారాలు తినాలి. 

క్యాన్సర్ ప్రోస్టేట్ సోకితే ఆ వ్యక్తి సరైన చికిత్స తీసుకుంటే అయిదేళ్ల వరకు జీవించే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే, 45 ఏళ్ల తర్వాత స్క్రీనింగ్ ప్రారంభించండి.

ఇలాంటి మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels