వర్షాకాలంలో చర్మం జిడ్డును తగ్గించుకునేందుకు ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 03, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సేబమ్ ప్రొడక్షన్ పెరిగి చర్మం జిడ్డుగా అయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. చర్మం జిడ్డుగా అయినా పట్టించుకోకపోతే మొటిమలు, పగుళ్లు వచ్చే రిస్క్ ఉంటుంది

Photo: Pexels

వానాకాలంలో చర్మం జిడ్డు తగ్గేందుకు కొన్ని టిప్స్ ఇక్కడ చూడండి. ఇవి పాటిస్తే జిడ్డు తగ్గేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

ప్రతీ రోజు తప్పకుండా కనీసం మూడుసార్లు ముఖాన్ని కడుక్కొండి. డీప్ క్లింసింగ్‍తో ఫేష్‍వాష్ చేసుకుంటే ఇంకా మేలు. తరచూ పేష్‍వాష్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న అదనపు ఆయిల్, దుమ్ము తొలగిపోతుంది. 

Photo: Pexels

వర్షాకాలమైనా సరైన సరిపడా నీరు తాగితేనే చర్మానికి కూడా మేలు జరుగుతుంది. నీరు బాగా తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. చర్మం డిటాక్స్ అయి, అదనంగా ఉండే జిడ్డు వెళ్లేందుకు సహకరిస్తుంది. 

Photo: Pexels

జెల్ బేస్డ్ సన్‍స్క్రీన్‍ను పూసుకోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు, పగుళ్లు రాకుండా తోడ్పడుతుంది. చర్మం జిడ్డును తగ్గిస్తుంది. 

Photo: Pexels

వారానికి ఒకసారి స్క్రబ్‍తో ఎక్స్‌ఫోలైట్ చేసుకోవాలి. ఇలా చేస్తే సేబమ్ ఉత్పత్తి నియంత్రణలో ఉండి.. చర్మం జిడ్డు కంట్రోల్ అయి పగుళ్లు తక్కువవుతాయి. 

Photo: Pexels

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels