పాలు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఈ 6 టిప్స్ పాటించండి.
pexels
By Bandaru Satyaprasad Aug 21, 2024
Hindustan Times Telugu
మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో పాలు ఒకటి. పాలను సరిగ్గా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి. పాలను ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.
pexels
సరైన ఉష్ణోగ్రత వద్ద పాలను నిల్వ చేయండి. పాలను తాజాగా ఉంచేందుకు శీతలీకరణ ముఖ్యం. పాలను పాడుచేసే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా మిల్క్ ను 4 డిగ్రీల సెంటీగ్రేడ్(39 డిగ్రీల ఫారన్ హీట్) వద్ద లేదా అంత కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.
pexels
పాలను నిల్వ చేసేటప్పుడు బిగుతు మూతలు ఉండే పాత్రలు ఉపయోగించండి. గాలి తగిలితే బ్యాక్టీరియా, ఇతర కలుషితాలు చేరి పాలను త్వరగా పాడుచేస్తాయి. ఫ్రిజ్ లోని ఇతర పదార్థాల వాసనలను పాలు గ్రహించకుండా మూతపెట్టాలి.
pexels
పాలను ఎల్లప్పుడూ శుభ్రమైన పాత్రల్లోనే నిల్వచేయాలి. ఇతర ఆహార పదార్థాల పాత్రల్లో పాలను నిల్వ చేయకూడదు. ఒకవేళ వాటిల్లో పాలను పోస్తే బ్యాక్టీరియా సోకి తొందరగా చెడిపోతాయి.
pexels
మీరు పెద్ద పాత్రల్లో పాలను కొనుగోలు చేస్తే వాటిని చిన్న పాత్రల్లోకి మార్చి నిల్వచేయండి. పాలు తాజాగా ఉండేందుకు పాత్రలను సరైన విధంగా శుభ్రం చేసుకోవాలి.
pexels
పాలు వినియోగించినప్పుడు మిగిలిన పాలను బయట ఉంచకూడదు. ఇది పాల నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీలైనంత త్వరగా పాలను ఫ్రిజ్ లో పెట్టాలి.
pexels
పాలను కొనుగోలు చేసేటప్పుడు గడువు తేదీని చెక్ చేయండి. వీలైనంత వరకు తాజా పాలను ఎంచుకోండి. పాలను తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయండి.
pexels
ఎక్కువగా తిని, కడుపు ఉబ్బిపోయిందా? గ్యాస్ నొప్పిని ఇలా తగ్గించుకోండి!