ఐపీఎల్లో ప్రతి సీజన్లో ఆడిన ప్లేయర్స్ ఐదుగురు ఉన్నారు

By Hari Prasad S
Mar 25, 2025

Hindustan Times
Telugu

ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ మొత్తం 18 సీజన్లలో ఆడిన ప్లేయర్స్ ఎవరో చూడండి

ఎమ్మెస్ ధోనీ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంటాడు. ఐపీఎల్ 2008 ప్రారంభమైనప్పుడు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు.

సీఎస్కే సస్పెన్షన్ కు గురైన 2016, 2017 సీజన్లలో ఎంఎస్ ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.

2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ ప్రస్తుతం 18వ సీజన్లో అదే జట్టుకు ఆడుతున్నాడు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని అన్ని సీజన్లలో ఒకే జట్టుకు ఆడిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది.

ఐపీఎల్ 2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.2009లో ఆ టీమ్ తరఫునే అతడు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాడు

రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు.

రవీంద్ర జడేజా 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011 సీజన్లో కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడాడు.

జడేజా 2012 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. సీఎస్కే సస్పెన్షన్ కు గురైన 2016, 2017 సీజన్లలో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.

అజింక్య రహానే రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

అజింక్య రహానే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.  

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash