డిసెంబర్, జనవరిలో గోవాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. నిత్యం ఉత్సాహవంతమైన వేడుకలు జరుగుతుంటాయి. ప్రస్తుతం వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. బీచ్ లు, వినోద విహారయాత్రలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. 

unsplash

By Bandaru Satyaprasad
Dec 18, 2023

Hindustan Times
Telugu

క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలతో గోవా వీధులు, మార్కెట్‌లు, బీచ్ లు సందడి నెలకొంటుంది.  

pexels

ఎలక్ట్రిక్ నైట్ లైఫ్, బీచ్ పార్టీల వేడుకల్లో మునిగితేలడానికి ఇదే ఉత్తమ సమయం. డిసెంబర్ లో గోవా ట్రిప్ కు ప్లాన్ చేస్తుంటే మీరు అక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాలు గురించి తెలుసుకోండి.   

pexels

 బీచ్ టైమ్ -గోవాలో బాగా బీచ్, కలంగుటే బీచ్, అంజునా బీచ్, మరెన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. ఈ బీచ్‌లు విశ్రాంతి తీసుకోవడానికి, బీచ్‌సైడ్ షాక్స్‌ని ఆస్వాదించడానికి, పారాసైలింగ్, జెట్-స్కీయింగ్, బనానా బోట్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు చక్కటి ప్రదేశాలు.

pexels

గోవా  నైట్‌లైఫ్ -గోవాలో నైట్ లైఫ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. హిప్ క్లబ్‌లు, బార్‌లు, బీచ్ షాక్స్, కేఫ్‌లు, రెస్టారెంట్‌లు జనంతో కిక్కిరిసి పోతుంటాయి. బీచ్ పార్టీలను మిస్ చేయవద్దు, ముఖ్యంగా నూతన సంవత్సరం సందర్భంగా బీచ్ పార్టీలు ఎంతో ఉత్సాహంగా ఉంటాయి.   

pexels

ఓల్డ్ గోవా-  ఓల్డ్ గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్, సెయింట్ అగస్టీన్ టవర్‌తో సహా చారిత్రక ప్రదేశాలను సందర్శించండి.   

pexels

స్పైస్ ప్లాంటేషన్ టూర్- పోండా ప్రాంతంలో మసాలా తోటలు ఉంటాయి. ఇక్కడ మీరు సుగంధ ద్రవ్యాల గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈ మసాలా తోటలు ప్రామాణికమైన గోవా వంటకాలను ఆస్వాదించండి.  

pexels

మాండోవి రివర్ క్రూయిజ్- గోవాలోని ముఖ్యమైన నదులలో మాండోవి నది ఒకటి. ఈ నదిలో రిలాక్సింగ్ రివర్ క్రూయిజ్‌లను అందుబాటులో ఉన్నాయి. ఈ క్రూయిజ్ మీకు అద్భుతమైన సన్ సెట్ దృశ్యాలను, మడ అడవుల వీక్షించవచ్చు.   

pexels

అడ్వెంచర్ ప్రదేశాలు-  మీకు అడ్వెంచర్స్ అంటే ఇష్టమా? అయితే గోవాలో మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి. దూద్‌సాగర్ ట్రెక్, జంగిల్ ట్రెకింగ్ చేయవచ్చు. నీటిలో కయాకింగ్, స్నార్కెలింగ్ అడ్వెంచర్స్ ఎక్స్ ప్లోర్ చేయొచ్చు. ఈ సమయంలో డాల్ఫిన్‌లను కూడా చూడవచ్చు.  

బిగ్‌బాస్ షో అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని దీపికా రంగ‌రాజు అలియాస్‌  బ్ర‌హ్మ‌ముడి కావ్య అన్న‌ది. 

twitter