పైనాపిల్ తీపి, టార్ట్ రుచి కలిగిన సూపర్ ఫుడ్. అనాస అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పైనాపిల్ ఎందుకు తినాలో 6 కారణాలు తెలుసుకుందాం.
pexels
పైనాపిల్ లోని విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇన్పెక్షన్లు, జలుబు నుంచి కాపాడుతుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు 79 మి.గ్రా విటమిన్ సి అందిస్తాయి.
pexels
పైనాపిల్ లో బ్రోమెలైన్స్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయి. ఇది భోజనం తర్వాత ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
pexels
పైనాపిల్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పైనాపిల్ బెస్ట్ ఫ్రూట్. పైనాపిల్ తిన్నాక కడుపు నిండుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
pexels
పైనాపిల్ లోని బ్రోమెలైన్ సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని రకాల కణితుల పెరుగుదలను అణచివేస్తుంది.
pexels
పైనాపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
pexels
పైనాపిల్ లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కీలకం. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించి, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.