బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పీరియడ్స్ విషయంలో కొందరికి అపొహలు ఉంటాయి.
Unsplash
By Anand Sai
Jan 27, 2025
Hindustan Times
Telugu డెలివరీ తర్వాత పీరియడ్స్ అనేవి శారీరక, మానసిక స్థితిపై ఆధారపడి వస్తాయి.
Unsplash
కొంతమందికి 3 నెలల తర్వాత రుతుక్రమం ప్రారంభమవుతుంది. మరికొందరికి 7-8 నెలల తర్వాత వస్తుంది.
Unsplash
కొంతమంది తల్లులలో రుతుక్రమం ఆలస్యం అవుతుంది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు.
Unsplash
డెలివరీ తర్వాత ఋతుస్రావం పాలిచ్చే తల్లులలో 8-10 నెలల తర్వాత, పాలివ్వని తల్లులలో 1 నుండి 2 నెలల తర్వాత సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
శరీరంలో తగినంత కొవ్వు లేకపోవడం హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. తద్వారా ఋతుస్రావం ఆలస్యం అవుతుంది.
Unsplash
పెరిగిన బరువు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఋతుస్రావం ఆలస్యం అవుతుంది.
Unsplash
డెలివరీ తర్వాత శిశువును జాగ్రత్తగా చూసుకోవడంలో శారీరక, మానసిక ఒత్తిడి హార్మోన్ల నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది.
Unsplash
ఒక్క లైన్తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్లు ఇవి..
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి