ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాల నిలయమైన బేరి పండును మీ ఆహారంలో చేర్చుకోండి. పియర్ పండుతో 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Aug 07, 2024
Hindustan Times Telugu
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - జీర్ణక్రియకు ఫైబర్ చాలా కీలకం. బేరి పండు ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇందులోని పెక్టిన్ వంటి ఫైబర్ పేగులలో కదలికలను ప్రోత్సహిస్తోంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
pexels
మంట, వాపును తగ్గిస్తుంది - బేరిలో క్వెర్సెటిన్, కాటెచిన్ లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి వాపు, మంట తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
చర్మ ఆరోగ్యం - బేరిలోని విటమిన్ సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మ ఆర్యోగాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా బేరి పండ్లు తింటే యవ్వనంగా, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.
pexels
హార్ట్ హెల్త్ - బేరి పండ్లలోని విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
pexels
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది - బేరి పండ్లలో కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇవి ఆర్థరైటీస్, బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడతాయి.
pexels
బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణ - పియర్స్ లోని ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. మధుమేహం ఉన్న వారికి బేరి పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
pexels
బరువు నిర్వహణకు - బేరి పండ్లలో తక్కువ క్యాలరీలు, పీచు పదార్థాలు, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువును నియంత్రించుకోవడంలో సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి.