పప్పు చేగోడీలు రెసిపీ సింపుల్‌గా

By Haritha Chappa
Dec 28, 2024

Hindustan Times
Telugu

కావలసిన పదార్థాలు పచ్చిశనగపప్పు - అరకప్పు బియ్యప్పిండి - ఒక కప్పు మైదా - అర కప్పు నీళ్లు - ఒకటిన్నర కప్పు ఉప్పు - రుచికి సరిపడా కారం - అర స్పూను ఫుడ్ కలర్ - చిటికెడు నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పచ్చిశనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టి తరువాత పొడి వస్త్రంతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. 

స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు వేసి అందులో కారం, ఉప్పు వేసి మరిగించాలి. ఎరుపు రంగు ఫుడ్ కలర్ చిటికెడు వేయాలి.

 మరిగించిన నీళ్లలో మైదాపిండి, బియ్యప్పిండిని  వేసి బాగా కలుపుకోవాలి.

గరిటెతో కలుతూ ఈ మిశ్రమం గట్టిగా ముద్దలాగా అయ్యే దాకా కలపాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. 

కాసేపటికి తరువాత రెండు స్పూన్ల నూనె వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి.

పిండి నుంచి చిన్న ముద్దను తీసి చేత్తోనే చేగోడీల్లాగా రోల్ చేసుకుని దానికి పచ్చి శెనగపప్పును అతికించాలి.  

వీటిని వేడెక్కిన నూనెలో వేసి అన్ని వైపులా వేగేలా వేయించుకోవాలి. అంతే టేస్టీ పప్పు చేగోడీలు రెడీ అయినట్టే.

బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..

Unsplash