హైదరాబాద్ నుంచి పాపికొండలు ట్రిప్ - ఇదిగో తాజా టూర్ ప్యాకేజీ

image credit to tg tourism

By Maheshwaram Mahendra Chary
Feb 09, 2025

Hindustan Times
Telugu

బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి పాపికొండలు చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. 

image credit to tg tourism

ప్రస్తుతం ఈ ప్యాకేజీ  21 ఫిబ్రవరి 2025వ తేదీన అందుబాటులో ఉంటుంది. వీకెండ్స్ లో ఆహ్లాదకరంగా గడిపి రావొచ్చు. బస్సులో జర్నీ ఉంటుంది.

image credit to unsplash

హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 6,999గా ఉంది. పిల్లలకు రూ. 5599గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.

image credit to ap tourism

హైదరాబాద్ నుంచి  జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి వరకు భద్రాచలం వెళ్తారు. రెండో రోజు ఉదయం పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. 

పాపికొండల్లో జర్నీ అత్యంత ఆహ్లాదకరంగా సాగుతుంది. గోదావరి అందాలను మాటాల్లో వర్ణించలేం. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

image credit to unsplash

ఈ ప్యాకేజీలో భాగంగా భద్రాచలంలోని పర్ణశాలను కూడా చూస్తారు. తిరిగి హైదరాబాద్ కు చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.

image credit to unsplash

ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ ను సంప్రదించవచ్చు.

image credit to twitter

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest