బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయి తినొచ్చా?

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Oct 03, 2023

Hindustan Times
Telugu

మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే బొప్పాయి పండు తినడం వల్ల మేలు జరుగుతుంది. వెయిట్ లాస్‍కు బొప్పాయి (Papaya) తోడ్పడుతుంది. బొప్పాయితో 5 ప్రయోజనాలు ఇవే. 

Photo: Unsplash

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండు తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. చిటికీ మాటికీ ఆహారం తినే అలవాటును తగ్గిస్తుంది. 

Photo: Unsplash

శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లే వ్యవస్థకు కూడా బొప్పాయి సహకరిస్తుంది. దీంతో వ్యర్థాలు సులభంగా బయటికి వెళతాయి. ఇది వెయిట్ లాస్‍కు తోడ్పడుతుంది. 

Photo: Unsplash

బొప్పాయి తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయి. దీంతో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణం మెరుగ్గా అవుతుంది. మలబద్ధకాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇలా కూడా బరువు తగ్గడంలో బొప్పాయి ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండు తింటే మీ క్యాలరీ ఇన్‍టేక్ కంట్రోల్‍లో ఉంటుంది. అలాగే బొప్పాయిలో విటమిన్ సీ, విటమిన్ ఏ, మెగ్నిషియమ్, ఫోలెట్, పొటాషియమ్ పుష్కలంగా ఉంటాయి. 

Photo: Unsplash

శరీరంలో ఐరన్‍ను పెంచే 5 రకాల జ్యూస్‍లు ఇవి

Photo: Pixabay