బంగ్లాదేశ్​లో హిందువులపై 200కుపైగా దాడులు- మైనారిటీలకు రక్షణ లేదా?

ANI

By Sharath Chitturi
Aug 11, 2024

Hindustan Times
Telugu

బంగ్లాదేశ్​లో షేక్​ హసీనా ప్రభుత్వం కూలిన అనంతరం ఆ దేశంలో హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.

ANI

170 మిలియన్​ జనాభాలో 8శాతంగా ఉండే హిందువులు షేక్​ హసీనా ప్రభుత్వానికి అనాదిగా మద్దతిస్తుండటం, నిరసనకారుల ఆగ్రహానికి కారణం.

Unsplash

గత కొన్ని రోజుల్లో  52 జిల్లాల్లో కనీసం రెండు హిందూ సంస్థలు, మైనారిటీ కమ్యూనిటీ సభ్యులపై 205 దాడులు జరిగాయి. అనేక హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయి.

Unsplash

తమపై దాడులను వ్యతిరేకిస్తూ, అనేక మంది హిందువులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేశారు.

ANI

రాజకీయ కారణాలతో మైనారిటీ వ్యక్తిపై దాడులు చేయడం సరైనది కాదని పలువురు విమర్శిస్తున్నారు.

ANI

హిందువులపై దాడులను ఆపాలని, వారిని రక్షించాలని బంగ్లాదేశ్​ తాత్కాలిక ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ANI

కాగా పలువురు ముస్లింలు హిందువులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు సైతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ANI

ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!

pexels