అండాశయ క్యాన్సర్ 9 సాధారణ లక్షణాలు

Image Credits : Adobe Stock

By Hari Prasad S
May 08, 2025

Hindustan Times
Telugu

అండాశయ క్యాన్సర్ అండాశయంలో ప్రారంభమవుతుంది. ఇది వ్యాప్తి చెందే వరకు సులువుగా గుర్తించలేము. అయితే కొన్ని సాధారణ లక్షణాలను తెలుసుకోవడం ద్వారా జాగ్రత్తగా ఉండొచ్చు.

Image Credits : Adobe Stock

మీ బొడ్డు దిగువన లేదా కటిలో నొప్పి లేదా ఒత్తిడి చాలా రోజుల పాటు అలాగే ఉండటం హెచ్చరిక సంకేతం కావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు

పొత్తికడుపు, కటి నొప్పి

Image Credits : Adobe Stock

మీరు ప్రయత్నించకుండా బరువు తగ్గుతున్నారా? ఆహారంలో మార్పులు లేదా వ్యాయామంలాంటివి లేకుండానే బరువు తగ్గడం కూడా ఒక లక్షణం కావచ్చు

ప్రయత్నించకుండానే బరువు తగ్గడం

Image Credits : Adobe Stock

రోజులు లేదా వారాల పాటు పొట్ట నిండుగా, వాపుగా లేదా ఉబ్బినట్లు అనిపించడం. ఎన్ని రోజులైనా అది తగ్గకపోతే దానిని అండాశయ క్యాన్సర్‌గా అనుమానించవచ్చు.

కడుపు ఉబ్బరం

Image Credits : Adobe Stock

విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోవడం కూడా క్యాన్సర్‌లో ప్రధాన లక్షణం. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు

నిరంతర అలసట

Image Credits : Adobe Stock

ఎలాంటి గాయం కాకపోయినా వెన్ను దిగువ భాగంలో నిరంతర నొప్పి కూడా అండాశయ క్యాన్సర్ లక్షణాలలో ఒకటని గుర్తించండి. ఈ నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు.

వెన్నునొప్పి

Image Credits : Adobe Stock

సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం లేదా మీ మూత్రాశయం నిండనప్పుడు కూడా అత్యవసరంగా అనిపించడం కూడా ఒక లక్షణం. అండాశయంలో కణతి పెరిగినప్పుడు కలిగే ఒత్తిడి ఇది

తరచుగా మూత్రవిసర్జన

Image Credits : Adobe Stock

కొంచెం తినగానే కడుపు నిండినట్లుగా అనిపించడం, ఆకలి లేకపోవడం కూడా అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటిగా గుర్తించాలి

ఆకలి లేకపోవడం

Image Credits : Adobe Stock

మలబద్ధకం, విరేచనాలు లేదా మీ పేగు అలవాట్లలో ఇతర మార్పులను విస్మరించకూడదు. ఇది కొన్ని రోజుల కన్నా ఎక్కువ ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడండి.

పేగు కదలికలలో మార్పులు

Image Credits : Adobe Stock

యోని నుంచి అసాధారణ రక్తస్రావం కావడం, పీరియడ్స్ సమయం కాకపోయినా ఇలా రక్తం కారుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను కలవండి

అసాధారణ రక్తస్రావం

Image Credits : Adobe Stock

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!