మార్కెట్ లో నకిలీ వస్తువులు రోజు రోజుకూ ఎక్కువౌతున్నాయి. ఫేక్ ప్రొడక్ట్స్ ను ఈ విధంగా గుర్తించవచ్చు.  

pexels

By Bandaru Satyaprasad
Mar 20, 2024

Hindustan Times
Telugu

భారీ డిస్కౌంట్లు- ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసినట్లయితే వాటి ధరలో కొంత భాగానికి తగ్గింపు లేదా డిస్కౌంట్ చూపిస్తారు. కానీ ఆఫర్ ముసుగులో భారీగా తగ్గింపు అంటే ఎంఆర్పీలో 70-80 శాతం తగ్గింపు ఉంటే కచ్చితంగా అది నకిలీ ప్రొడక్ట్ అని గుర్తించండి.   

pexels

నాసిరకం ప్యాకేజింగ్- ఒరిజినల్ బ్రాండ్‌లు నాణ్యమైన ప్యాకేజింగ్ పాటిస్తాయి. కానీ నకిలీ వస్తువుల ప్యాకింగ్ నాసిరకంగా ఉంటుంది. చౌకైన ప్లాస్టిక్ లేదా నాసిరకం కార్డ్‌బోర్డ్ వంటి మెటీరియల్‌తో చేస్తుంటారు 

pexels

స్పెల్లింగ్ మిస్టేక్స్- నకిలీ బ్రాండ్స్ అసలైన వస్తువుల పేర్లను పోలి ఉంటాయి. కానీ స్పెల్లింగ్ లో తప్పులు ఉంటాయి. స్పెల్లింగ్ తప్పులతో నకిలీ ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చు. బ్రాండ్ పేర్లలో మార్పులు చేసి కస్టమర్‌ను ఏమార్చడానికి ప్రయత్నిస్తారు.   

pexels

నకిలీ వెబ్‌సైట్‌లు- మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే నకిలీ వస్తువుల కొనుగోలును చేసేందుకు ఎక్కువ అవకాశం ఉండేది ఫేక్ వెబ్ సైట్స్. నకిలీ వెబ్ సైట్ ను URLతో ద్వారా నిర్థారించవచ్చు. httpకి బదులుగా https ఉంటుంది. వెబ్‌సైట్ చిరునామాను www.scamadviser.com, http://whoisలో చెక్ చేస్తే దాని ప్రామాణికత తెలుస్తుంది.   

pexels

 కాంటాక్ట్ వివరాలు లేకపోవడం - నకిలీ వస్తువులైతే కాంటాక్ట్ వివరాలు, తయారీదారు చిరునామా, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ లేదా సంప్రదింపు వివరాలు ప్యాకేజీలో ఉండవు. ఫిర్యాదుల కోసం సంప్రదించేందుకు అవకాశం ఉండదు. అటువంటి ఉత్పత్తులకు దూరంగా ఉండండి.  

pexels

ఫాంట్‌, లోగోల్లో మార్పులు- స్పెల్లింగ్‌ల మాదిరిగానే..నకిలీ లోగోలు, బ్రాండ్ పేర్లు, ట్రేడ్‌మార్క్‌లను గుర్తించాలి. నకిలీ వస్తువుల బ్రాండ్ల లోగోల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఒకసారి ఆ లోగోలను ఆన్ లైన్ లో చెక్ చేసుకోండి.   

pexels

మిస్ మ్యాచ్ - ఒరిజినల్ కంపెనీలు తమ పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పొందుపరుస్తాయి. ప్రొడక్ట్ పై కోడ్‌లు, సీరియల్ లేదా మోడల్ నంబర్‌లు, ట్రేడ్‌మార్క్, పేటెంట్ సమాచారం అన్నింటిని ముద్రిస్తారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో క్రాస్ చెక్ చేయవచ్చు.  

pexels

నాణ్యత- నకిలీ ఉత్పత్తుల నాణ్యత సాధారణంగానే గుర్తించవచ్చు. మెటీరియల్ ను నాసిరకం ప్లాస్టిక్, చౌకైన గాజు, నాణ్యత లేని ప్యాకేజ్ చేస్తారు.   

pexels

ఎలక్ట్రిక్ స్కూటీ కొంటున్నారా.. ఈ 8 విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

Image Source From unsplash