ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది

By Sudarshan V
Feb 05, 2025

Hindustan Times
Telugu

ఓలా ఇండియన్ మార్కెట్లో రోడ్ స్టర్ ఎక్స్ ను లాంచ్ చేసింది.

రోడ్ స్టర్ ఎక్స్ బ్రాండ్ పోర్ట్ ఫోలియోలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్.

ఇది స్టాండర్డ్, ఎక్స్ ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. 

దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభమౌతోంది.

2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి. 

రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ రెండు బ్యాటరీ ప్యాక్ లతో అందించబడుతుంది - 4.5 కిలోవాట్ మరియు 9.1 కిలోవాట్.

 9.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 501 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. 

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఓలా మూవ్ఓఎస్ 5తో నడిచే 4.3 అంగుళాల ఎల్సిడి స్క్రీన్ను కలిగి ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, అడ్వాన్స్డ్ రెజెన్, క్రూయిజ్ కంట్రోల్, టీపీఎంఎస్, ఓటీఏ అప్డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ లో ఎనర్జీ ఇన్ సైట్స్, అడ్వాన్స్ డ్ రెజెన్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ ఉన్నాయి. 

నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. జిడ్డును, నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ఈ నారింజ తొక్కలను ఎలా వాడాలో చూడండి

pexels