ప్రస్తుత కాలంలో ఊబకాయం చాలా మందికి సమస్యగా మారింది. అధిక బరువు వల్ల ఆరోగ్య ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. రాత్రి వేళ కొన్ని ఆహారాలు తినడం వల్ల ఊబకాయం సమస్య అధికమవుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. వీటిని రాత్రివేళల్లో తినకండి.
Photo: Pexels
రాత్రిళ్లు ఐస్‍క్రీమ్‍లు తినకూడదు. ఐస్‍క్రీమ్‍లో క్యాలరీతో పాటు బరువు పెరిగేలా చేసే కారకాలు చాలా ఉంటాయి. అందుకే రాత్రి వేళ వీటిని తినకూడదు.
Photo: Pexels
రాత్రిపూట రెడ్‍మీట్ కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో క్యాలరీలు, ఫ్యాట్ అధికంగా ఉంటాయి. రాత్రి రెడ్‍మీట్ తింటే ఊబకాయం పెరిగే రిస్క్ ఉంటుంది.
Photo: Pexels
నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు కూడా రాత్రిళ్లు ఎక్కువగా తినకూడదు. రాత్రిపూట ఫ్రైడ్ ఐటమ్స్ తింటే నిద్ర కూడా సరిగా పట్టదు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. అందుకే రాత్రివేళ ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోకపోపడమే మంచిది.
Photo: Pexels
రాత్రిపూట నెయ్యి, పెరుగు లాంటి ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి పగటి పూట తినొచ్చు కానీ.. నిద్రపోయే ముందు తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
Photo: Unsplash
రాత్రివేళ పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి జంక్ ఫుడ్స్ కూడా తినకూడదు. నిద్రలో ఇవి సరిగా జీర్ణంకావు. దీనిద్వారా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి.