బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. క్యాలరీలు తక్కువగా.. ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అలాంటివే ఓట్స్.
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా ఓట్స్ తినడం చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఎందుకో 5 కారణాలను ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తినకుండా ఓట్స్ చేయగలవు. క్యాలరీలు తక్కువగా తీసుకునేందుకు ఓట్స్ సహకరిస్తాయి.
Photo: Pexels
ఓట్స్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ డైట్‍కు ఇవి బాగా సూటవుతాయి. బరువు నియంత్రణలో ఉండేందుకు ఇవి తినడం తోడ్పడుతుంది.
Photo: Pexels
ఓట్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి తింటే జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. శరీరంలో క్యాలరీలు బాగా బర్న్ అయ్యేలా చేసి.. బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
Photo: Pixabay
ఓట్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. పేగుల కదలిక బాగుంటుంది. ఇలా బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
ఓట్స్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ తగ్గేందుకు ఇలా కూడా ఉపయోగపడతాయి.
Photo: Pexels
ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది