మూడ్ అస్సలు బాగోలేదా? వీటిని తినండి సెట్ అయిపోతారు! 

Pixabay

By Ramya Sri Marka
Mar 21, 2025

Hindustan Times
Telugu

ఎప్పుడూ ఏదో ఒక పని, రోజూ ఏదో ఒక ఆలోచన. మైండ్ అలసిపోకుండా ఎలా ఉంటుంది? అలసిపోతుంది, అప్పుడప్పుడూ అప్‌సెట్ అవుతుంది కూడా! అలాగని మూడ్‌ని మార్చుకోకపోతే ఎలా? మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. మీ మెదడును మీరే బుజ్జగించుకోవాలి. 

అప్‌సెట్లో ఉన్న మీ మైండ్‌ని రీయాక్టివేట్ చేయడానికి, మీ మెదడును ప్రేమగా బుజ్జగించి ప్రశాంతంగా, సంతోషంగా మార్చుకోడానికి కొన్ని ఆహారాలు మీకు సహాయం చేస్తాయట. అవునండీ.. మీ మూడ్ రీసెట్ చేసే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.  

Pixabay

డార్క్ చాక్లెట్: మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గించడానికి డార్క్ చాక్లెట్ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచి మిమ్మల్ని కూల్‌గా, హ్యాపీగా మార్చుతుంది. మూడ్ ఆఫ్ ఫీలింగ్ కలిగినప్పుడు ఓ డార్క్ చాక్లెట్ లాగించేయండి సెట్ అయిపోతారు. 

Pixabay

అరటిపండు: పసుపు రంగులో ఉండే అరటిపండులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ స్థాయిలను పెంచేందుకు దోహదపడే ఒక రకమైన అమైనో ఆమ్లం.అంతేకాదు అరటిలో సమృద్ధిగా లభించే విటమిన్ B6 మానసిక స్థితిని, అకస్మాత్తుగా కలిగే ఒత్తిడిని నియంత్రిస్తుంది.  ఇలాంటి ఫీలింగ్ మీ కలిగినప్పుడు ఒకటి లేదా రెండు అరటిపండ్లను ఆస్వాదించండి. 

Pexels

ఓట్స్: ఓట్స్ శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. కానీ ఇవి మానసిక స్థితిని ప్రభావితం చేసే చక్కెర స్థాయిల్లో మార్పులను నియంత్రిస్తుంది. మీ మైండ్‌ని ఈజీగా సెట్ చేస్తుంది. మూడ్ స్వింగ్స్ బారిన పడకుండా చేస్తుంది. మూడ్ బాగోలేనప్పుడు పండ్లు,  గింజలులతో ఇంట్లో తయారుచేసిన గ్రానోలా బార్లు లేదా కూరగాయలతో చేసిన ఓట్స్ ట్రై చేయండి. 

Pixabay

ఆకుకూరలు: ఆకుపచ్చ కూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్లు అయిన సెరోటోనిన్,  డోపమైన్ లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.లోగా ఫీల్ అయినప్పుడు ఆకుకూరలతో చేసిన స్మూతీలు లేదా పరోటా, ఆమ్లెట్ వంటి వాటిని తినండి.  

Pixabay

అవకాడో: అవోకాడోలో విటమిన్ B3, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదం చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మూడ్ ఆఫ్  ఫీలింగ్ కలిగినప్పుడు నేరుగా అవోకాడో తినడం లేక అవకాడో టోస్ట్, అవకాడో జ్యూస్ వంటి  వాటిని తీసుకోవడం చేయండి.

Pixabay

నట్స్ అండ్ సీడ్స్  వాల్నట్లు, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు వంటి వాటిలో  ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి. మూడ్ బాగోలేనప్పుడు వీటిని వేయించుకుని తినడం లేదా స్మూతీలు, సలాడ్లలో వేసుకుని తినడం వంటివి చేయండి.

Pixabay

బెర్రీ పండ్లు స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ,  రాస్ బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మీ మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి.   మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడతాయి. తీపి రుచి కోసం వీటిని పెరుగు, పాన్ కేక్ లేదా సలాడ్లు వంటి వాటితో బెర్రీ పండ్లను తినండి

Pixabay

గ్రీన్ టీ ఎల్-థియానిన్ అనే అమైనో ఆమ్లంతో సమృద్ధిగా ఉన్న గ్రీన్ టీ, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మీ రోజును గ్రీన్ టీతో ప్రారంభించండి, ఇది మిమ్మల్ని మరింత సంతోషంగా, ఫోకస్గ్‌గా పనిచేసేలా చేస్తుంది.  ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

Pixabay

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల  అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

ఇండియాలో వీటిని చూడకపోతే చాలా మిస్ అవుతారు

భారత్ లోని  అద్భుత పర్యాటక ప్రదేశాలు

PEXELS