దక్షిణ భారత వంటకాల్లో ఆకుకూరలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సంప్రదాయ వంటకాల్లో వాడే 9 రకాల ఆకులు, వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Feb 14, 2025

Hindustan Times
Telugu

మామిడి ఆకు- మామిడి ఆకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. సంప్రదాయ వేడుకలలో, ఆహారాన్ని వడ్డించడానికి దీనిని ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంగా నాన్ వెజ్ వండినప్పుడు మామిడి ఆకులు వేస్తుంటారు.  

pexels

తమలపాకులు - తమలపాకులో యూజినాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్ లను ఉత్తేజపరిచి, జీర్ణక్రియను సహాయపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.  

pexels

పనస ఆకు - పనస ఆకులను పర్యావరణ అనుకూల ప్లేట్ల తయారుచేయడానికి ఉపయోగిస్తారు. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఆహారాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.  

 అరటి ఆకు- అరటి ఆకులో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆహారంలోకి వెళ్లి రుచిని పెంచుతాయి.  

pexels

 అంజీర్ ఆకు- అంజీర్ ఆకు ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆహారానికి ప్రత్యేకమైన రుచిని జోడిస్తాయి. 

pexels

పసుపు ఆకు- పసుపు ఆకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  

pexels

ప్లాంటాగో లీఫ్- ఇది అరటి ఆకు మాదిరిగానే ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శీతలీకరణకు ఉపయోగిస్తారు.  

pexels

టేకు ఆకు - టేకు ఆకులో జీర్ణక్రియకు సహాయపడే సహాజ ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి.  

pexels

కొబ్బరి ఆకు - కొబ్బరి ఆకులకు చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. కొన్ని ఆహారాలను కొబ్బరి చాపలపై ఆరబెడతారు. ఆహారానికి ఇవి తేలికపాటి కొబ్బరి రుచిని జోడిస్తాయి.   

pexels

రాశి ఫలాలు: ఆర్థికాభివృద్ధి, వివాదాలకు తావుండదు. మార్చి 29 రాశిఫలాలు