న్యూ ఇయర్‌లో క్యాలెండర్ మారడమే కాదు ఈ ఆర్థిక చిట్కాలు పాటిస్తే మీ జీవితం కూడా మారిపోతుంది
pexels
By Hari Prasad S Dec 31, 2024
Hindustan Times Telugu
సంపాదించిన దాంట్లో ముందు పొదుపు చేసి మిగిలినదానిని ఖర్చు పెట్టడం అనేది ఎవర్‌గ్రీన్ ఆర్థిక సూత్రం. కొత్త ఏడాదిలో ఈ ఫార్ములాను కచ్చితంగా పాటించండి
pexels
చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు స్వైప్ చేస్తే మీకే నష్టం. సరిగ్గా వాడితే క్రెడిట్ కార్డు ఓ వరం. ఖర్చుపై అదుపు లేకపోతే అదే అతిపెద్ద శాపం అవుతుంది
pexels
డబ్బులు ఎవరికీ ఊరికే రావు. అందుకే మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే ఖర్చు పెట్టండి. ఇతరులతో పోల్చుకోకుండా మీ పరిమితి ఎంతో తెలుసుకొని అంతే ఖర్చు చేయండి
pexels
ఖర్చుల లెక్కను ప్రతి నెలా పక్కాగా రాసుకోండి. దీనివల్ల మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎక్కడికెళ్తుందో తెలుస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్న నెలలో కారణమేంటో ఇట్టే తెలిసిపోతుంది
pexels
పొదుపు డబ్బులన్నీ ఒకే అకౌంట్లో కాకుండా ఒక్కో లక్ష్యానికి ఒక్కో అకౌంట్ ఏర్పాటు చేసుకొని పొదుపు చేసుకుంటే మీ వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఎమర్జెన్సీ ఫండ్, వెకేషన్ ఫండ్ లాంటివి.
pexels
హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి రుణాలను సరిగా మేనేజ్ చేయండి. పెరిగిన ఆదాయానికి తగినట్లుగా ఈ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
pexels
ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ముఖ్యమైనది. కష్టకాలంలో ఎవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం లేకుండా చేసే నిధి ఇది. ఇప్పటి వరకూ మీకు ఇలాంటి ఫండ్ లేకపోతే వెంటనే మొదలుపెట్టండి
pexels
గుండె జబ్బుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు గుర్తించడం ఎలా...