ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఎంత శ్రద్ధ వహించాలో పరిశుభ్రతపై కూడా అంతే శ్రద్ధ వహించాలి.
Image Credit : Unsplash
By Anand Sai Jul 23, 2025
Hindustan Times Telugu
స్నానం చేసేటప్పుడు శరీరంలోని కొన్ని భాగాలను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తారు.
Image Credit : Unsplash
శరీరంలో ఎక్కువగా చెమట పేరుకుపోయే ప్రదేశం చంకలు. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు వస్తాయి.
Image Credit : Unsplash
తొడల చుట్టుపక్కల ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను రోజూ సరిగ్గా శుభ్రం చేయకపోతే మురికి పేరుకుపోతుంది. దురద, అలెర్జీలు, చికాకు వంటి సమస్యలకు దారితీస్తుంది.
Image Credit : Unsplash
చాలా మంది తమ మోచేతులు, మోకాళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోరు. నిర్లక్ష్యం చేస్తే, ఈ ప్రాంతాల్లో చర్మం పొడిగా మరియు గరుకుగా మారవచ్చు.
Image Credit : Unsplash
చాలా మంది పాదాల శుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిరంతరం దుమ్ము, ధూళికి గురవుతాయి.
Image Credit : Unsplash
నాభి శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం, దీనిని చాలా మంది విస్మరిస్తారు. స్నానం చేసేటప్పుడు నాభి శుభ్రతపై శ్రద్ధ చూపరు. ఈ ప్రాంతంలో చాలా బ్యాక్టీరియా నివసిస్తుంది.
Image Credit : Unsplash
చాలా మంది స్నానం చేసేటప్పుడు వీపును శుభ్రం చేసుకోరు. వీపును శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వీపుపై పేరుకుపోయిన మురికి చర్మ అలెర్జీలు, చర్మ వ్యాధులకు దారితీస్తుంది.
Image Credit : Unsplash
చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.