ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు ఉండరు. మండే ఎండల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడతారు.

Unsplash

By Anand Sai
May 27, 2024

Hindustan Times
Telugu

ఐస్ క్రీం తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలో తెలుసుకోండి. 

Unsplash

ఐస్ క్రీం తిన్న తర్వాత టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది కడుపు నొప్పి, వాంతులు కలిగిస్తుంది.

Unsplash

ఐస్ క్రీం తిన్న తర్వాత సిట్రస్ పండ్లు తినకూడదు. ఎందుకంటే సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు మీ పొట్టలోని ఐస్‌క్రీమ్‌తో కలిసి గ్యాస్, అజీర్ణానికి కారణమవుతాయి.

Unsplash

ఐస్ క్రీం తిన్న తర్వాత చాక్లెట్ తినకూడదు. ఎందుకంటే చాక్లెట్‌లోని కెఫిన్, పొట్టలోని ఐస్‌క్రీమ్‌లో కలిసిపోయి కడుపునొప్పి వస్తుంది.

Unsplash

ఐస్ క్రీం తిన్న తర్వాత మద్యం సేవించడం వల్ల వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

Unsplash

ఐస్‌క్రీం తిన్న తర్వాత వేయించిన పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఇది కడుపులో ప్రతికూల రసాయన ప్రతిచర్యలను కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

Unsplash

అందుకే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాలా సేపటి వరకూ ఇతర ఆహారాలు తీసుకోకపోవడమే ఉత్తమం.

Unsplash

19 మార్చి 2025 రాశి ఫలాలు