వృక్ష రూపంలో మనుషులకు లభించిన దివ్య ఔషధం మునగ, పెరటిలో లభించే మునగ చెట్టు మానవాళిక లభించిన కల్ప వృక్షం, కామధేనువు, ధన్వంతరిల మేలు కలయికగా పరిగణిస్తారు.
By Bolleddu Sarath Chandra Dec 09, 2024
Hindustan Times Telugu
మునగచెట్టును వృక్ష శాస్త్రంలో Moringa Oleifera అని పిలుస్తారు. దీనిని డ్రమ్‌స్టిక్ ట్రీ, ట్రీ ఆఫ్ లైఫ్, మిరకిల్ మొరింగా, మదర్స్ బెస్ట్ ఫ్రెండ్, నెబిడాయే అనే పేర్లతో పిలుస్తారు.
ఆఫ్రికా భాషలో నెబిడాయే అంటే మృత్యువు లేనిదని అర్థం, ఒకసారి నాటిన తర్వాత చెట్టు కాండాన్ని ఎన్నిసార్లు నరికినా తిరిగి మొలకెత్తుతూనే ఉంటుంది. మునగచెట్టుకు మృత్యువు ఉండదు.
మునగ చెట్టు ఆకులను, పూతను, కాయలను తినేవారు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో చిరకాలం జీవిస్తారు
మునగచెట్టు ఉత్తరభారత దేశంలో పుట్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలకు విస్తరించింది. ప్రపంచం అంతటా మునగ పంట సాగు చేస్తున్నారు.
మునగ చెట్టుతో దాదాపు 300రకాల వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది.
మునగ ఆకుల్లో పోషక పదార్ధాలను పరిశీలిస్తే సూపర్ ఫుడ్స్‌కే సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. మునగ ద్వారా శరీరానికి కావాల్సిన మాంసకృతులు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు మెండుగా లభిస్తాయి.
మునగాకులో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. విటమిన్ ఏ, బి1, బి2, బి3 ఇందులో పుష్కలంగా లభిస్తాయి.
శరీరంలో జీవకణాలు, కండరాలు, అవయవాల నిర్మాణానికి అవసరమైన ఆర్జినైన్, హిస్టిడైన్, విసైన్, ట్రిప్టోఫాన్, ఫెనిలానివైన్, మెధియోనైన్, థ్రియోనైన్, ల్యూనైన్, సోల్యూసైన్ వంటివి మునగాకులో ఉంటాయి. ప్రకృతిలో ఉన్న 20 యామినో యాసిడ్స్‌లో 19 మునగాకులో లభిస్తాయి.
ఆరోగ్య రక్షణకు 40రకాల పోషక పదార్ధాలు అవసరం కాగా మునగాకులో 92రకాల పోషకాలు లభిస్తాయి.
శరీరంలో స్ట్రెస్ హార్మోనుల్ని స్థిరీకరించి శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యాన్ని యథాస్థితిలో కొనసాగించేందుకు మునగాకు ఉపయోగపడుతుంది.
న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు మునగాకును ప్రకృతిలో లభించే ముఖ్యమైన ఎడాప్టోజనిక్ హెర్బ్‌గా నిర్ధారించారు.
పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి