ఏపీలో వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దీనికోసం 95523 00009 నంబరు సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ఆ నంబరులో కావాల్సిన సేవలు పొందవచ్చు. Hi అని మెసేజ్ చేయగానే సేవల జాబితా ప్రత్యక్షం అవుతుంది.
By Bolleddu Sarath Chandra Jan 30, 2025
Hindustan Times Telugu
తొలివిడతలో 161 రకాల సేవల్ని వాట్సాప్ మనమిత్ర ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు. ఇందులో దేవాలయ సేవల బుకింగ్, ప్రజాఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, సిఎంఆర్‌ఎఫ్ సేవలు, రెవిన్యూ, హెల్త్, పోలీస్ శాఖల సేవలు ఉంటాయి.
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో లబించే సేవల్ని వాట్సాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ ద్వారా చేసిన ఫిర్యాదుల స్థితిని మనమిత్ర వాట్సాప్ పేజీలో తెలుసుకోవచ్చు.
ఏపీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల బుకింగ్, రద్దు సేవల్ని పొందవచ్చు.
ఏపీలోని మూడు టెలికం డిస్కమ్‌ల విద్యుత్ బిల్లులలను చెల్లించవచ్చు.
ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుల స్థితిని తెలుసుకోవచ్చు.
సిడిఎంఏ సేవల్ని మనమిత్రలో పొందవచ్చు.
రెవిన్యూ శాఖ ద్వాారా అందించే పలు రకాల సేవల్ని వాట్సాప్‌లోనే పొందే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన సేవల్ని కూడా వాట్సాప్‌లోనే పొందవచ్చు.
పోలీస్ శాఖ అందించే వివిధ రకాల సేవల్ని వాట్పాప్‌లోనే పొందవచ్చు. దీనికోసం 95523 00009 నంబరు సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ఆ నంబరులో కావాల్సిన సేవలు పొందవచ్చు. Hi అని మెసేజ్ చేయగానే సేవల జాబితా ప్రత్యక్షం అవుతుంది.
నానబెట్టిన వేరుశెనగ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పెద్దలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలని చెబుతారు.