నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
pexels
By Bandaru Satyaprasad Oct 09, 2024
Hindustan Times Telugu
జిమ్ దుస్తులు సాధారణంగా నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ ఫాబ్రిక్‌ల నుంచి తయారు చేస్తారు. వీటిలో విషపూరిత రసాయనాలు ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
pexels
ఓ అధ్యయనం ప్రకారం సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌లో ఉపయోగించే బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ హార్మోన్ల అంతరాయాలు, థైరాయిడ్ వ్యాధి వంటి ఆరోగ్య ప్రభావాలను కలిగించవచ్చని తేలింది.
pexels
మీరు నగ్నంగా వ్యాయామం చేయాలనుకుంటే సురక్షితమైన ప్రైవేట్ ప్రాంతాన్ని ఎంచుకోండి. మీకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోండి. రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ సంగీతాన్ని ప్లే చేసుకుంటూ వర్కౌట్ చేయండి.
pexels
శరీర అవగాహన - నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల మీ శరీర కదలికలపై మరింత అవగాహన ఏర్పడుతుంది.
pexels
కాన్ఫిడెన్స్ లెవల్స్ - నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయని ఓ అధ్యయనం చెబుతోంది.
pexels
ఉష్ణోగ్రత నియంత్రణ - దుస్తులు లేకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మీ వ్యాయామాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
pexels
మోటివేషన్ - చెమటలు పట్టేలా వ్యాయామం చేయడం మీలో ప్రేరణను కలిగిస్తుంది. నగ్నంగా వర్కౌట్‌లు మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఇది మీ రొటీన్ ఫిట్‌నెస్ కు ఒక ప్రేరణగా ఉంటుంది.
pexels
మైండ్‌ఫుల్‌నెస్ - నగ్నంగా వ్యాయామం వల్ల... మీ వ్యాయామ సెషన్‌లపై ఎక్కువ దృష్టి పెట్టడానికి, మైండ్ డైవర్షన్లు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
pexels
చర్మ ఆరోగ్యం - జిమ్ దుస్తులు సాధారణంగా బిగుతుగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని చికాకు పెడతాయి. వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ చర్మానికి గాలి తగలడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తుంది.(ఈ వెబ్ స్టోరీ ఇంటర్ నెట్ ఆధారిత సమాచారం. హెచ్.టి.తెలుగు దీనిని ధ్రువీకరించలేదు)
pexels
చలికాలంలో చాలా మంది రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగాల బారిన పడుతుంటారు. అలా కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో చూడండి