వంటకు ఆవనూనె మంచిదా.. కాదా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 08, 2025

Hindustan Times
Telugu

వంటల్లో వాడుకునేందుకు చాలా రకాల నూనెలు అందుబాటులో ఉంటాయి. అందులో ఆవనూనె కూడా ఒకటి. ఆవాల నుంచి తయారు చేసే ఈ నూనె వాడడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందోనని చాలా మందికి సందేహం ఉంటుంది.

Photo: Pexels

ఆవనూనెలో పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే వంటకాల్లో అవనూనెను వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ నూనెతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటే.. 

Photo: Pexels

ఆవనూనెలో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ నూనె వంటల్లో వినిగిస్తే కీళ్లు, కండరాల నొప్పులు తగ్గేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఆవనూనెలో ఒమేగా-3, ఒమేగా-6 లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పొడి చర్మం, మొటిమలు, మచ్చలు లాంటివి తగ్గేలా చేయగలదు. జుట్టుకు కూడా మంచి చేస్తుంది.  

Photo: Pexels

ఆవనూనెలో మోనోసాచురేటెడ్, పాలిసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి ఈ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తోడ్పడతాయి. 

Photo: Pexels

జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులను ఆవనూనెల తగ్గించగలదు. ఈ నూనెలో వేడి కారకాలు ఉంటాయి. వేడి ఆవనూనెను వెల్లుల్లితో ఛాతిపై రాస్తే శ్వాసకోశ వ్యాధులు తగ్గేందుకు ఉపయోపడుతుంది. 

Photo: Pexels

ఆవనూనెలో యాంటీఆక్సిడెంట్లు, మరిన్ని కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచగలదు. బాడీలో వాపు ప్రక్రియను కూడా తగ్గించగలదు. 

Photo: Pexels

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest