ఈ 5 దుంప కూరలను రెగ్యులర్‌గా తప్పనిసరిగా తినాలి! ఎందుకంటే..

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 13, 2025

Hindustan Times
Telugu

భూమిలో పెరిగే కూరగాయలను దుంప కూరలని అంటారు. ఈ దుంప కూరగాయల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలా తప్పక తినాల్సిన 6 దుంప కూరలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

క్యారెట్ కూడా ఓ దుంప కూరగాయే. క్యారెట్‍లో బీటా కరోటిన్ సహా కీలకమైన విటమిన్లు సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. క్యారెట్‍ను రెగ్యులర్‌గా తినడం వల్ల రోగ నిరోధక శక్తి, కంటి ఆరోగ్యం, చర్మం మెరుగవుతాయి. మరిన్ని లాభాలు ఉంటాయి. 

Photo: Pexels

చిలకడదంపల్లో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిని కూడా ఇవి తగ్గించగలవు. చర్మానికి కూడా మంచిది. శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 

Photo: Pexels

ముల్లంగిలో విటమిన్ సీ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను ఈ దుంప కూర ఎంతో మెరుగుపరుస్తుంది. ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. 

Photo: Pexels

బీట్‍రూట్‍లో చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రక్త ప్రసరణను, గుండె ఆరోగ్యాన్ని, పనితీరును బీట్‍రూట్ మెరుగుపరుస్తుంది. ఓవరాల్ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. 

Photo: Pexels

అల్లంలో జింజర్‍సోల్స్ సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఔషధ గుణాలు మెండు. అల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది.

Photo: Pexels

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram