శరీరానికి పోషకాలు బాగా అందాలంటే ఆహారంలో గ్రీన్ వెజిటబుల్స్ కూడా తప్పకుండా ఉండాలి. ఈ గ్రీన్ కూరగాయల్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలా.. మీ డైట్‍లో తప్పక యాడ్ చేసుకోవాల్సిన ఐదు 5 రకాల గ్రీన్ వెజిటబుల్స్ ఇవి.
Photo: Pexels
బ్రకోలీలో విటమిన్ సీ, ఫైబర్ సహా మరిన్ని విటమిన్స్, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంటాయి.
Photo: Pexels
క్యాబేజ్‍లో విటమిన్ సీ, గ్లూకోసినోలెట్స్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇది తినడం వల్ల జీర్ణక్రియకు మంచి జరుగుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Photo: Pexels
పాలకూర, కేలే, బచ్చలికూరలో ఫోలెట్ సహా కొన్ని ముఖ్యమైన విటమిన్స్ ఉంటాయి. రక్తకణాల ఉత్పత్తికి ఇవి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచగలవు. వీటిలోని మెగ్నిషియమ్, పొటాషియమ్ వల్ల గుండెకు కూడా మంచి జరుగుతుంది.
Photo: Pexels
గ్రీన్ బీన్స్‌లో విటమిన్ కే, కాల్షియమ్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది. క్యాలరీలు తక్కువుగా ఉండటంతో బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది.
Photo: Pexels
పచ్చి బఠానీల్లో విటమిన్ ఏ, సీ, కేతో పాటు ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. ఇవి తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండె పనితీరుకు కూడా ఉపకరిస్తాయి.
Photo: Pexels
మాంసాహార ఆహారాలు ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం.