కర్బూజతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీని విత్తనాలతో అంతకుమించిన ప్రయోజనాలు పొందవచ్చు.
Unsplash
By Anand Sai May 28, 2024
Hindustan Times Telugu
అజీర్ణం, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలతో బాధపడేవారు కర్బూజ గింజలను తింటే అజీర్ణం సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం బాధితులు ఈ గింజలను తింటే మలబద్ధకం రాకుండా ఉంటుంది.
Unsplash
అధిక రక్తపోటు ఉన్నవారు కర్బూజ విత్తనాలు తినడం మంచిది. రోజూ కొద్దిగా ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
Unsplash
కర్బూజ గింజల్లో కాల్షియం ఉంటుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది.
Unsplash
ఒమేగా కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు. కర్బూజ విత్తనాలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
Unsplash
గర్భిణీ స్త్రీలకు కర్బూజ విత్తనాలు చాలా మంచివి. ఇది గర్భాశయంలో నీటిశాతం తగ్గకుండా చేస్తుంది. తల్లి ఆరోగ్యానికి, పిల్లల అభివృద్ధికి కూడా చాలా సహాయపడుతుంది.
Unsplash
కర్బూజ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని గింజలను నోటిలో వేసుకుని తింటే వ్యాధి రాకుండా ఉంటుంది.
Unsplash
వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జలుబు, దగ్గు కూడా వస్తుంది. కర్బూజ గింజలు తినడం వల్ల ఈ రకమైన సమస్యలను నివారించవచ్చు.
Unsplash
భారతదేశంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ధర ఎంతో తెలుసా? కిలో రూ.3 లక్షలు.