మునగాకు నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన చర్మంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలకు వన్ స్టాప్ సొల్యూషన్ మోరింగా వాటర్. మోరింగా వాటర్ తో కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.   

pexels

By Bandaru Satyaprasad
Jan 29, 2025

Hindustan Times
Telugu

సమృద్ధిగా పోషకాలు- మోరింగా వాటర్ లో ఎ, సి, ఈ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. సాధారణ ఆరోగ్యం, శక్తిని ప్రోత్సహించే అమైనో ఆమ్లాల పుష్కలంగా ఉంటాయి.   

pexels

రోగనిరోధక శక్తి- మునగాకు నీటిలో ఫ్లేవనాయిడ్లు,  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.   

pexels

బరువు తగ్గడంలో - మోరింగ నీరు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. జీవక్రియను పెంచడం, ఫ్యాట్ బర్న్ ను వేగవంతం చేస్తుంది. మునగాకులోని ఫైబర్ ఆకలిని తగ్గించి అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.  

pexels

జీర్ణక్రియ - మునగాకు వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఫైబర్ కంటెంట్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ ఒక ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది.  

pexels

చక్కెర స్థాయిలను నియంత్రణ-  రక్తంలో చక్కెర నియంత్రణకు అద్భుతాలు చేయగల పానీయం మునగాకు. మోరింగా నీటిలోని ఐసోథియోసైనేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఇది ప్రయోజనకరం.  

pexels

గుండె ఆరోగ్యానికి- మోరింగా వాటర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. మోరింగాలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ధమనులలో కొవ్వు చేరడాన్ని తగ్గిస్తుంది.   

pexels

చర్మం, జుట్టు ఆరోగ్యం- మునగాకు వాటర్ లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిచేస్తాయి. చర్మపు సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టును బలోపేతం చేస్తాయి.   

pexels

మోరింగా వాటర్ తయారీ : 1-2 టీస్పూన్లు మోరింగా పొడి (లేదా కొన్ని తాజా మోరింగ ఆకులు) 1 గ్లాసు గోరువెచ్చని నీరు   రుచి కోసం నిమ్మకాయ రసం లేదా 1 టీస్పూన్ తేనె 

pexels

గమనిక : మునగాకు వాటర్ తో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. దీన్ని వినియోగించే ముందు వైద్యులను సంప్రదించండి. ఈ వెబ్ స్టోరీ ఇంటర్ నెట్ ఆధారిత సమాచారం. 

pexels

కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో జ్యోత్స్న‌గా విల‌న్ పాత్ర‌లో యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది గాయ‌త్రి సింహాద్రి.

Instagram