మునగాకుతో ఏ వ్యాధులు నయం అవుతాయో తెలుసా...

By Sarath Chandra.B
Mar 28, 2025

Hindustan Times
Telugu

మునగాకులో ఉండే పీచు పదార్ధం ప్రేగులలో పేరుకుపోయిన మలిన పదార్ధాలను తొలగించి ఆరోగ్య రక్షణకు తోడ్పడుతుంది. 

మునగాకులో ఉండే ఐసోథయోసయనేట్స్‌, హై ఫైలొరి బాక్టీరియాను నిరోధించి కడుపులో పుండ్లను, క్యాన్సర్లను నివారిస్తుంది. 

కడుపులో మంటను నివారించడంలో సేఫ్‌ హెర్బల్ యాంటాసిడ్‌గా పని చేస్తుంది. 

మునగాకులో ఉండే యాంటీ బాక్టీరియల్స్‌, యాంటీ మైక్రోబియల్స్‌ ద్వారా వ్యాధికారక బాక్టీరియాను నిరోధిస్తుంది. 

యాంటీ బయాటిక్స్‌కు లొంగని సాల్మనెల్లా, ఈ కోలి, సాఫ్టిలోకోసిస్‌ ఔరియన్ వంటి బాక్టీరియాను నివారిస్తుంది. 

దుమ్ము, ధూళి, పుప్పొడి మొదలైన వాటి ద్వారా ఎలర్జిక్ రైనైటిస్, ప్రాణాంతకమైన ఎనాఫిలిక్స్‌కు గురవుతారు. 

మునగాకులో ఎలర్జీలను అరికట్టే గుణాలు పుష్కలంగా ఉంటాయి. 

మునగాకు,  పొడి ఊపిరితిత్తుల వాపును అరికడుతుంది. ఆస్త్మాకు సంబంధించిన గురకను, ఊపిరాడని స్థితిని దగ్గును తగ్గించి శ్వాసను తేలిక చేస్తుంది. 

మునగాకులో ఫెనాల్సియిన క్వెర్‌టిన్‌, క్యాంఫెరాల్‌, నియాజిమైసిన్‌, కాన్సర్‌ కణితిలను నివారిస్తాయి. 

మునగ వేళ్లు కిడ్నీలలో, బ్లాడర్‌లో, గర్భసంచిలో ఏర్పడే రాళ్లను నిరోధిస్తాయి. మందుల వల్ల కిడ్నీలలో ఏర్పడే టాక్సిన్స్‌ తొలగించడంలో మునగాకు ఉపయోగ పడుతుంది. 

మునగాకు మెదడులో మోనో ఎమైన్సయిన నోర్‌పైన్‌ఫ్రయిన్‌ సెరోటినిన్‌, డోపమైన్‌లను స్థిరీకరించి డిప్రెషన్‌ నుంచి రక్షిస్తుంది. 

మునగాకులో ఐసోథయోసయనేట్‌, నియోజెనిన్‌లు ధమనులు గట్టి పడకుండా నిరోధించి పల్మనరీ హైపర్‌  టెన్షన్ అరికడుతుంది. 

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి